భారతదేశం, ఆగస్టు 21 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ ఈగలు తోలుకుంటూ ఉంటాడు. రోహిణి ఉన్నప్పుడు షాప్ కళకళలాడేది. ఇప్పుడు వెలవెలలాడుతుంది. ఏమైనా చేసి రోహిణి లేకున్నా కూడా షాపును లాభాల్లోకి తీసుకురావాలి అని మనోజ్ అనుకుంటాడు.

ఇంతలో మనోజ్ షాప్ ముందు రిచ్ కార్ ఆగుతుంది. ఎవరితను అంబానీ చుట్టంలా ఉన్నాడు అనుకుంటాడు మనోజ్. అతను బాలు జైలు ఫ్రెండే. అతన్ని కూర్చొబెట్టి మర్యాదలు చేస్తాడు మనోజ్. తర్వాత నాకు ఈ లిస్ట్‌లో ఉన్న వస్తువులు కావాలని పెద్ద లిస్ట్ ఇస్తాడు అతను. చాలా పెద్ద ఆర్డర్. వారంలో రోజుల్లో డెలివరీ ఇస్తానని మనోజ్ అంటాడు.

నేను అప్పుడే ఇస్తాను. ఆవిడ ప్రజెంటేషన్ ఇచ్చాకా. మిసెస్ రోహిణి మనోజ్. ఆవిడ చాలా పెద్ద వ్యాపారవేత్త అవుతారు. ఇది చిన్న షాప్ కానీ, ఆవిడ చెబితే ఏదో మాయ ఉంది...