భారతదేశం, సెప్టెంబర్ 15 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తాగొచ్చి ట్రాఫిక్ పోలీస్‌తో గొడవ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఊదుతాను, నా బేరం పోగొట్టాడు, తాగలేదని తెలిసి కూడా ఊదమనడం అవమానించడమేగా అని బాలు రచ్చ చేస్తాడు.

ఊదుతా రాజా అంటూ అరుణ్ చెంపలు పట్టుకుంటాడు. అరెయ్ ఎక్కువ చేస్తున్నావురా అని రాజేష్ అంటాడు. ఇందాక తాగలేదని తెలిసింది కదా. ఇప్పుడెందుకు తాగొచ్చి ఇష్యూ చేస్తున్నావని మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటాడు. బ్రీత్ అనలజైర్ తీసుకుని ఊదిన బాలు వెలిగింది.. వెలిగింది.. నన్ను అరెస్ట్ చేయండని అరుణ్‌తో అంటాడు.

ఏంటీ తాగొచ్చి న్యూసెన్స్ చేస్తున్నావని కేస్ పెడతానని అరుణ్ అంటాడు. అయితే ఇలా లేకుంటే అలా అని బాలు అంటాడు. నీ ఫ్రెండ్‌ని తీసుకెళ్లు. ఆరోజు నో పార్కింగ్‌లో వీడియో తీశావ్‌గా నేను...