భారతదేశం, అక్టోబర్ 6 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వాహా మాతాజీ దగ్గరికి వెళ్లిన ప్రభావతి రోహిణి, మనోజ్ విడిపోయేందుకు తాయిత్తు కావాలంటుంది. దానికి తగినట్లే దొంగ మాతాజీ ఇస్తుంది. సరిగ్గా 9 గంటల 30 నిమిషాలకు కట్టాలని చెబుతుంది.

కామాక్షి తనకు ఆ బిందే కావాలంటుంది. అమ్మో ఈవిడ నాకే ఎసరు పెట్టేలా ఉందే అని మాతాజీ అనుకుంటుంది. పైకి మాత్రం బిందెతో కొడితే బొందల పడతావ్ అని మాతాజీ అంటుంది. రోజు రోజు కుప్పలుగా డబ్బులు వస్తాయిగా. ఇక్కడ ఉంటే ఏం చేస్తావ్. నాకు ఇస్తే వడ్డీకి తిప్పి చిట్టీలు వేసి పది రెట్లు చేస్తానని కామాక్షి అంటుంది.

అధిక ప్రసంగం అని మాతాజీ అంటుంది. అవన్నీ వద్దుగానీ ఇచ్చిన తాయత్తుకు దక్షిణ దండిగా ఇవ్వండి లేకుంటే తాయత్తు వికటిస్తుందని పక్కనున్న ఆమె చెబుతుంది. దాంతో కామాక...