భారతదేశం, ఆగస్టు 11 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ కిందకు వచ్చి తల్లి గురించి అడిగితే లేదని మీనా చెబుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చానని మనోజ్ అడిగితే.. మావయ్య, ఆయన తీసుకొచ్చారని మీనా చెబుతుంది. ఆకలేస్తుందా, మజ్జిగ ఇవ్వనా అని మీనా అడిగితే వద్దని, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు మనోజ్.

మనోజ్‌కు డోర్ తీయరాదు. మీనా వెళ్లి తీస్తుంది. మనోజ్ వెళ్తాడు. తర్వాత బాలు వస్తాడు. మనోజ్ గురించి చెబుతుంది మీనా. బాలు భోజనం తీసుకొస్తాడు. మీనా చేయి సరిగా లేదని భోజనం తీసుకొచ్చినట్లు బాలు చెబుతాడు. తర్వాత మీనాకు బాలు తినిపిస్తాడు. మీనా గోరుముద్దల గురించి మాట్లాడితే ముద్దుల గురించి బాలు అంటాడు.

తర్వాత ఇంట్లో ఎవరు లేరు.. పార్లరమ్మా రూమ్‌లో ఏమైనా దొరుకుతాయేమో చూద్దామా అని బాలు అ...