భారతదేశం, అక్టోబర్ 19 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గదిలోనుంచి మెల్లిగా లేచి డాబాపైకి వెళ్లి గుణకు కాల్ చేస్తుంది రోహిణి. కీస్ తీసుకోమ్మని గుణకు విసిరేస్తుంది. బాలు కారు కీస్ తీసుకున్న గుణ తన అసిస్టెంట్‌తో బ్యానెట్ ఓపెన్ చేయించి ఏదో చేయిస్తాడు.

ఏం చేయించావ్ అని రోహిణి అడిగితే.. రేపు బాలు కారు ముట్టుకోకుండా ఉండేలా చేశానని గుణ వెళ్లిపోతాడు. రోహిణి కిందకు రాగానే ప్రభావతి నీళ్లకోసం వస్తుంది. అది చూసిన రోహిణి షాక్ అయి దిండు కింద కీస్ పెట్టడం కుదరదని పక్కకు పడేసి వెళ్లిపోతుంది. ఎవరో వెళ్లినట్లు ప్రభావతికి డౌట్ వస్తుంది. గదిలో మనోజ్ లేచి ఉంటాడు. ఎక్కడికెళ్లావ్ అని అడుగుతాడు.

మంచినీళ్లు తాగడానికి వెళ్లానని అబద్ధం చెబుతుంది. మరుసటి రోజు ఉదయం స్కూల్‌కి చింటు కోసం వెళ్తున్నట్లు బా...