భారతదేశం, మార్చి 23 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో ముంబై ముఖేష్‌తో చాలా మాట్లాడాం, అంతా నిజం చెప్పేసాం కదా అని బాలు, రవి అంటారు. నువ్వు ఆడించిన నాటకం మొత్తం చెప్పేశామని రవి అంటాడు. నాటకం ఏంట్రా, ఎందుకు అంత కంగారుపడుతున్నారని సత్యం నిలదీస్తాడు.

దాంతో మనోజ్ డ్రామా గురించి బాలు చెబుతాడు. ముఖేష్ దగ్గర బిల్డప్ ఇచ్చారని శ్రుతి అంటుంది. మొత్తం కుటుంబాన్నే ఇలాంటి ఫ్రాడ్ పనిలోకి దింపావా అని సత్యం అంటాడు. నిన్ను మాత్రం చాలా మెచ్చుకున్నాడు నాన్న. అందుకే అబద్ధం చెప్పి మోసం చేయాలనిపించలేదు, అందుకే నిజం చెప్పానని బాలు అంటాడు.

బాలు కాలర్ పట్టుకుని నన్ను నిలువునా ముంచావు కదరా అని మనోజ్ అంటాడు. జెంటిల్ మెన్ అడిగితే చెప్పాలని నువ్వే అన్నావుగారా అని బాలు అంటాడు. అవును, నువ్వు చెప్పమంటేనే...