భారతదేశం, ఆగస్టు 25 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కళ్ల ఆరోగ్యం గురించి మీనా చెప్పడంతో ఆపుతావా కళ్ల డాక్టర్ అయ్యేలున్నావ్ అంటాడు బాలు. శివకు ఇవాళ డిగ్రీ పరీక్ష ఉందని మీనా చెబుతుంది. వాడు మారాడు. పాస్ అయి బాగా చదివి మిమ్మల్ని బాగా చూసుకుంటాడని బాలు అంటాడు.

మా నాన్న కూడా ఇదే ఆశపడ్డాడు. కానీ, అంతలోనే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా. శివకు మంచి ఉద్యోగం రావాలని మీనా అంటే.. సుమతి కూడా ఉంది. తనకు మంచి పెళ్లి సంబంధం చూడాలని బాలు అంటాడు. మావయ్యకు కాఫీ ఇవ్వడం మర్చిపోయానని మీనా వెళ్లిపోతుంది. ఇంతలో బాలుకు సుమతి కాల్ చేసి శివ నిన్న సాయంత్రం నుంచి ఇంటికి రాలేదని, చదుకోడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఇంకా రాలేదంటుంది.

ఫోన్‌ స్విచ్ఛాఫ్ వస్తుందంటే చార్జింగ్ లేదేమో అని బాలు అంటాడు. చార్జర...