భారతదేశం, మార్చి 5 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో విద్య ఇంటి డోర్ బెల్ కొడతాడు బాలు. నేను వెళ్లి తీస్తానని చింటూ వెళ్తాడు. ఇంతలో రోహిణికి విద్య కాల్ చేసి బాలు గురించి చెబుతుంది. దాంతో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చింటును డోర్ తీయకుండా తీసుకెళ్తుంది రోహిణి. కిటికీ లోనుంచి బాలు చూస్తాడు. కానీ, అంతలోనే రోహిణి లోపలికి వెళ్తుంది.

ఎవరు డోర్ తీయకపోవడంతో నేనే ఎక్కువగా అనుమానించానా, రాజేష్ గాడు ఎందుకలా చెప్పాడనుకుని తిరిగి బయలుదేరుతాడు. రవి, శ్రుతి మాట్లాడుకుంటుండగా రవి రెస్టారెంట్ మేనేజర్ కనిపిస్తాడు. వాళ్లు కూడా ముడుపులు కట్టేందుకు వచ్చామని చెబుతారు. యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పిల్లలు కావాలంటే నొప్పులు పడలేక వద్దంది, ఇప్పుడు నలుగురిని చూసి నాకు పిల్లలు కావాలంటుంది అని మేనేజర్ చెబుతాడు.

ఇప్పటికైనా కళ్లు తెరిచారు అని శ్రుతి అంట...