భారతదేశం, సెప్టెంబర్ 4 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా, శ్రుతిని గేట్ బయటి నుంచే పంపించేసి ఉంటారని ప్రభావతి, రోహిణి అవమానంగా మాట్లాడుతారు. మన గేట్ బయట ఏం జరుగుతుందో చూడండని శ్రుతి అంటుంది.

అప్పుడే కారులో నీలకంఠం, సంజు వస్తారు. ఇద్దరికి మర్యాదలు చేస్తారు. ఎన్నాళ్లకు మా పేదింటికి వచ్చారని ప్రభావతి అంటుంది. పేదిళ్లా.. గంజినీళ్లు తాగి అతుకుల బట్టలు వేసుకుంటున్నామా అని శ్రుతి కౌంటర్ ఇస్తుంది. ఏదైనా సమస్య అని సత్యం అడుగుతాడు. మా నుంచి ఓ తప్పు జరిగింది. అది సరిదిద్దుకుందామని వచ్చామని నీలకంఠం అంటాడు.

అయ్యో బాబాయ్ ఎంతమాట. అది సంజు అన్నయ్య చెబితే ఎంత బాగుండేది మీరు చెబుతున్నారు అని మీనా, శ్రుతి అంటారు. నీలకంఠం సైగ చేయడంతో మేము హడావిడిలో ఉండి మౌనికను బాధపెట్టాల్సి వచ్చింది. బాల...