భారతదేశం, అక్టోబర్ 27 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నవరాత్రుల సందర్భంగా సత్యం ఇంట్లోవాళ్లంతా బూజు దులుపుతుంటారు. అక్కడికి వచ్చిన శ్రుతి తల్లి శోభ కూలీల్లాగా పనులేంటని, శ్రుతి పని చేస్తున్నందుకు తిడుతుంది.

పూలమ్ముకునే ఇంట్లో పుట్టావా అని మీనాను ఉద్దేశించి, తల్లితండ్రి లేకుండా అనాథలా పెరిగావా అని రోహిణిని కలిపి శ్రుతిని అంటుంది శోభ. చాలా రోజుల తర్వాత వచ్చారు. కూర్చోండి. మీనా కాఫీ పెట్టివ్వమని డైవర్ట్ చేసేందుకు ప్రభావతి అంటుంది. పాలు విరిగిపోయాయని మీనా, గ్యాస్ కూడా అయిపోయిందని రోహిణి అంటారు.

నా కూతురుతో ఎందుకు పని చేయిస్తున్నారని శోభ అంటే.. మేము వద్దాన్నాం. తనే చేస్తానందని సత్యం చెబుతాడు. చేస్తానంటే చేయిస్తారా. ఇంకా కోడళ్లు ఉన్నారుగా. నా కూతురు వాళ్లలా దిక్కుమాలిన ఇంటి నుం...