భారతదేశం, మార్చి 18 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో ఫొటోలు తీస్తానని రోహిణి అంటే.. వద్దని సెల్ఫీ తీసుకుంటామని పంపించేస్తాడు బాలు. అలాగే సెల్ఫీ తీసుకుంటారు. ఫోన్ తీసుకోవడం కుదరట్లేదని రోహిణి అంటే.. వాళ్లు రోజు రోజుకు తెగ నచ్చేస్తున్నారని విద్య అంటుంది.

అసలు నీ సమస్య ఏంటీ బాలు అంత నచ్చాడా. పెళ్లి చేసుకుంటావా ఏంటీ అని రోహిణి అడుగుతుంది. అలా కాదు. వాళ్లిద్దరికి పెళ్లి అయిపోయింది. వాళ్ల మధ్యలోకి ఎవరు రాకూడదు. మా పరివార్ అవార్డ్ ఇస్తే వాళ్లకే వస్తుందని విద్య అంటుంది. ముంబై నుంచి డీలర్‌షిప్ ఇచ్చేందుకు ముఖేష్ అనే వ్యక్తి వస్తాడు. అతన్ని అందరికి మణికంఠ పరిచయం చేస్తాడు.

బాలు, రవి వాళ్లు సెల్ఫీలు తీసుకుంటుంటే అది చూసిన మనోజ్ మణికంఠకు సైగ చేస్తాడు. దాంతో మణికంఠ వెళ్లి సెల్ఫీలు దిగొ...