భారతదేశం, అక్టోబర్ 29 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు వాళ్లు నిర్వహిస్తున్న దేవి నవరాత్రులకు చందా రాసినవాళ్లకు ప్రైజ్ మనీ ఇస్తున్నామని బాలు చెప్పినట్లుగా ఫోన్‌లో రాజేష్ చెబుతాడు. మనోజ్ లక్కీ డ్రా తీస్తారా అని అడుగుతాడు.

ఫస్ట్ ప్రైజ్ కారు, రెండో ప్రైజ్ 100 గ్రాముల గోల్డ్, మూడో ప్రైజ్ 10 లక్షల క్యాష్ ఇంకా చాలా ఉన్నాయని రాజేష్ చెబుతాడు. స్ల్పిట్ చేసి రాయొచ్చా అని మనోజ్ అడిగితే.. నువ్వు డబ్బు వేస్ట్ చేయను అన్నావుగా అని రాజేష్ అంటాడు. లక్కీ డిప్ ఉందని చెప్పలేదుగా అని రాజేష్ అంటాడు. అయితే మినిమమ్ వెయ్యి రూపాయల చందా రాయాలని రాజేష్ అంటాడు.

అయితే, పది రిసిట్స్ ఇవ్వమని మనోజ్ అంటే.. రూ. 10 వేలు ఇవ్వమని రాజేష్ అంటాడు. అలా మనోజ్‌తో రూ. 10 వేలు టోకరా వేసి చందా రాయిస్తారు బాలు, మనో...