భారతదేశం, మార్చి 31 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్‌లో శివకు జరిగిన అవమానంతోనే దొంగతనం చేశాడని, వాడికి డబ్బు మీద వ్యామోహం లేదని, అమ్మే విషయాన్ని పెద్దది చేసిందని తండ్రి సత్యంకు బాలు చెబుతాడు. అంతా విన్న సత్యం సైలెంట్‌గా ఉంటాడు. మనోజ్, రోహిణి శివను అంటే బాలు సపోర్ట్ చేస్తాడు.

నేరం చేసిన వాడికి శిక్ష పడాలి, కానీ శిక్ష పడిన ప్రతివాడు నేరస్థుడు కాదు. వాడు చెడు సావాసాలతో బైక్ దొంగతనం చేశాడు. దానికి మా నాన్న చనిపోయాడు. గుణపాటం చెప్పాలని మళ్లీ దొంగతనం చేశాడు. ఈసారి శిక్ష నాకు పడింది. అది నేను చేసిన తప్పా, నాకు ఏది తెలియదు, తెలిసి నేను ఏది దాచలేదు, నాకెందుకు శిక్ష వేస్తున్నారు అని ఏడుస్తూ మీనా చెప్పుకుంటుంది.

ఇంతలో పోలీసులు వచ్చి దొంగతనం ఇంటి సమస్య శివపై కేసు వేయకుండా చూసుకుంటానని బాలు చెప్...