భారతదేశం, సెప్టెంబర్ 14 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సింగరాజు డబ్బు ఇవ్వననకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచనలో పడిపోతుంది మీనా. ఇంతలో బాలు కాల్ చేస్తాడు. సింగరాజు విషయం చెబుతుంది మీనా.

ఆర్డర్ రాకముందే డిపాజిట్ పెట్టే రిస్క్ చేయలేనని అన్నారని, చింతామణి ముందు చాలా గర్వంగా ఛాలెంజ్ చేశా. నేను చెప్పిన మాట నన్ను ఇబ్బందిపెట్టేలా ఉందని మీనా అంటుంది. ఫైనాన్షియర్‌కు కనిపించేది డబ్బు మాత్రమే. పెట్టినదానికి ఎంత వస్తుందనే చూస్తారు. మనం సాయం చేయమంటాం కానీ వాళ్లు బిజినెస్ అంటారని బాలు అంటాడు.

ఒకసారి ఇంటికెళ్లి మా అమ్మను కలిసి వస్తాను అని మీనా చెబుతుంది. మీనాకు డబ్బు దొరికే అవకాశం చూడమని బాలు అంటాడు. ఇంతలో ఓప్యాసెంజర్ ఫ్యామిలీతో వచ్చి కారు క్లీన్‌గా ఉందో చూస్తాడు. బాలును స్నానం చేశావా ...