భారతదేశం, ఏప్రిల్ 17 -- Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఓ స్కూల్ దగ్గరికి సత్యం వెళ్తాడు. వెళ్లి కరాస్పాండెంట్‌ను కలుస్తాడు. రంగారావు పంపించాడని చెప్పడంతో సత్యంను మర్యాదగా చూస్తాడు. ఏదైనా జాబ్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతాడు సత్యం. రంగారావు గారు మిమ్మల్ని అకౌంటెంట్‌గా రికమండ్ చేశారు. మీరు రోజు రావాల్సిన పని లేదు. వారానికి ఒకరోజు వస్తే చాలు అని అంటాడు కరాస్పాండెంట్‌.

ఎందుకని అని సత్యం అడిగితే.. మాకు ఇంకో స్కూల్ ఉంది. ఇంకొన్ని రోజుల్లో అక్కడ వెకెన్సీ ఉంది. అప్పటివరకు ఇక్కడే ఉండాలి. బుధవారం ఒక్కరోజు వస్తే చాలు. ఎప్పటి నుంచి రావాలో త్వరలో చెబుతాం మీ నెంబర్ మా మేనేజర్‌కి ఇచ్చి వెళ్లండని కరాస్పాండెంట్‌ చెబుతాడు. దాంతో సత్యం వెళ్లిపోతాడు. ఇంతలో అదే స్కూల్‌కి చింటుతో కలిసి రోహిణి, స...