భారతదేశం, మే 22 -- IPL 2026 GT vs CSK : ఐపీఎల్ 2026లో లీగ్ దశలో భాగంగా గురువారం రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. వన్-సైడెడ్ (ఏకపక్షం) గా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ విసిరిన భారీ లక్ష్య ఛేదనలో చెన్నై బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ ఘోర ఓటమితో సీఎస్కే వరుసగా మూడో ఏడాది కూడా ప్లేఆఫ్స్ చేరకుండానే లీగ్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై 13.4 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది! ఈ గెలుపుతో గుజరాత్ 18 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, చెన్నై 7వ స్థా...