భారతదేశం, అక్టోబర్ 19 -- హైదరాబాద్ మహానగరంతో పాటు దానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో నీటి సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వార్షిక భూగర్భ జల వనరుల్లో దాదాపు 70 శాతానికి పైగా ఇప్పటికే తోడేయడంతో ఈ ప్రాంతాలు తీవ్రమైన గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ (భూగర్భ జల ఒత్తిడి)ని ఎదుర్కొంటున్నాయి.

2025-26 సంవత్సరానికి సంబంధించిన ఇండియా-గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఎస్టిమేషన్ సిస్టమ్(IN-GRES) అంచనాల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలతో కూడిన కోర్ అర్బన్ రీజియన్‌లో లభ్యమయ్యే 72,000 హెక్టార్-మీటర్ల వార్షిక భూగర్భ జలాల్లో.. ఇప్పటికే దాదాపు 48,000 హెక్టార్-మీటర్ల నీటిని తోడేసినట్లు తేలింది.

ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే భూగర్భ జలాల తోడకం పునరుద్ధరణ అయ్యే లభ్యత కంటే దాటిపోయింది. జిల్లాలోని మొత్తం 16 గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ యూనిట్లలో 15 యూనిట్లు క్రిటిక...