భారతదేశం, సెప్టెంబర్ 15 -- Gold plated Ganesha idol : గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా హైదరాబాద్ బేగం బజార్‌లోని 'లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్' ఒక అద్భుతమైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించింది. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్‌తో పాటు ఏకంగా 3,83,800 అమెరికన్ డైమండ్లను అమర్చి ఈ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా తయారు చేశారు.

గణేష్ చతుర్థిని పురస్కరించుకుని తమ సంస్థలో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఇది మూడో ఏడాదని లిచీ పెరల్ సెట్ జ్యువెలర్స్ నిర్వాహకుడు అధర్ అగర్వాల్ తెలిపారు.

"గత రెండేళ్లుగా మేము వినాయకుడిని ప్రతిష్టిస్తున్నాం. ఈ మూడో ఏడాది ఏమైనా ప్రత్యేకంగా చేయాలని భావించాం. ఆ స్వామివారి ఆశీస్సులతోనే ఈ అత్యద్భుతమైన విగ్రహాన్ని రూపొందించాం," అని అధర్ అగర్వాల్ ఏఎన్‌ఐ (ANI) వార్తా సంస్థతో చెప్పారు.

ఇత్తడితో పాటు మొత్తం ఐదు రకాల లోహాలతో (పంచలోహాలు) ఈ వ...