Gold, Silver Price: వెండి ధర కిలోపై రూ. 2,300లకు పైగా పతనం.. బంగారం కూడా దిగొచ్చింది
భారతదేశం, ఏప్రిల్ 24 -- ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల మధ్య బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 24) భారతీయ మార్కెట్లో వెండి ధరలు పతనమయ్యాయి. ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో కిలో వెండి ధర 1 శాతం అంటే సుమారు రూ. 2,300 కంటే ఎక్కువ తగ్గి రూ. 2,39,200 వద్ద స్థిరపడింది. బంగారం కూడా స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 600 మేర తగ్గి రూ. 2,41,513 వద్ద ట్రేడవుతోంది.
సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు పెరగడం, అమెరికా డాలర్ తన ప్రతాపాన్ని చూపడం వల్ల లోహాల ధరలపై ఒత్తిడి పెరిగింది. బ్రెంట్ క్రూడ్ ధర ఈ వారంలోనే 17 శాతం ఎగబాకి బ్యారెల్ కు 105 డాలర్ల పైకి చేరింది. చమురు ధరలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.