Godavari Floods : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక.. కోనసీమలోని పలు గ్రామాల్లో హైఅలర్ట్
భారతదేశం, ఆగస్టు 1 -- గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా గత 24 గంటల్లో నీటిమట్టాలు గోదావరి నదిలో భారీగా పెరిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో చర్ల - వెంకటాపురం మధ్య రహదారి సంబంధాలు తెగిపోయాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం సమీపంలోని విస్టా కాంప్లెక్స్ పరిసరాల్లో నిలిచిన వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు భారీ పంపులను ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద నీటి మట్టం 55 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
భద్రాచలంతో పాటు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ నీటిమట్టం మరింత పెరిగినా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.