Godavari Flood Update : భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం - ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
భారతదేశం, ఆగస్టు 2 -- Godavari Flood Update : గత కొన్ని రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది భద్రాచలం వద్ద క్రమంగా శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది.
భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 47.9 అడుగులకు చేరింది. ప్రవాహం తగ్గడంతో అధికారులు ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఇక కూనవరం వద్ద నీటిమట్టం 21.50 మీటర్లుగా నమోదు కాగా, పోలవరం వద్ద 13.39 మీటర్ల వద్ద ప్రవాహం కొనసాగుతోంది.
ఎగువన ప్రవాహం తగ్గుతున్నప్పటికీ, దిగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజి వద్ద మాత్రం వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.69 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతోంది. దీంతో అధికారులు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.