భారతదేశం, మార్చి 31 -- హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అధికారులు.. హెచ్-ఫాస్ట్ బృందంతో కలిసి కాటేడాన్‌లో ఎస్‌కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో అల్లం పేస్ట్ తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు ఆహార కల్తీ దందాను అధికారులు ఛేదించారు. నాలుగు టన్నులకు పైగా కలుషితమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం ముడిసరుకులతో అపరిశుభ్రమైన ఉత్పత్తులను తయారు చేసి, వాటిని రెస్టారెంట్లు, టోకు వ్యాపారులకు సరఫరా చేస్తున్న యూనిట్ యజమానిని అరెస్టు చేశారు.

ఇక్కడి నుంచి నగరంలోని రెస్టారెంట్లు, టోకు వ్యాపారులకు కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. కాటేడాన్‌లోని ఒక తయారీ యూనిట్‌పై అధికారులు దాడి చేయగా.. 4 టన్నుల (4,032 కేజీల) అల్లం-వెల్లుల్లి పేస్ట్‌త...