భారతదేశం, ఏప్రిల్ 9 -- బుధవారం భారతీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది. అటు ఆర్‌బీఐ (RBI) పరపతి విధాన ప్రకటన, ఇటు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ వార్తలతో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు ఎగబాకింది. అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లను ఒక్కసారిగా భయపెట్టాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం 23,940 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది నిన్నటి ముగింపుతో పోలిస్తే సుమారు 117 పాయింట్ల లోటును సూచిస్తోంది. అంటే, ఈరోజు దలాల్ స్ట్రీట్ నష్టాలతోనే బోణీ చేసే అవకాశం ఉంది.
వాల్ స్ట్రీట్ నిన్నటి సెషన్‌లో అద్భుతమైన లాభాలను సాధించింది. డౌ జోన్స్ గత ఏడాది కాలంలో ఎన్నడూ లేనంతగా 2.85 శాతం మేర జంప్ చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో ఇస్లామాబాద్‌లో ఇరాన్‌తో చర్చల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.