భారతదేశం, మార్చి 1 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను పరిష్కారం అనే ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది పౌరుల ఆస్తి పన్ను సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి మార్చి నెలాఖరు వరకు ప్రతి ఆదివారం నిర్వహిస్తారు. ప్రాపర్టీ ట్యాక్య్ పరిష్కారం పేరుతో నడుస్తుంది.

జీహెచ్ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఈ కార్యక్రమం మార్చి 1, 8, 15, 22, 29 తేదీలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నగరంలోని అన్ని సర్కిల్ కార్యాలయాలలో నిర్వహిస్తారు. డిప్యూటీ కమిషనర్లు, వాల్యుయేషన్ అధికారులు/అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, టాక్స్ ఇన్స్పెక్టర్లు ఫిర్యాదులను నేరుగా స్వీకరించడానికి, పరిష్కరించడానికి హాజరవుతారు.

ఈ ప్రోగ్రామ్ రివిజన్ పిటిషన్లను వేగవంతం చేయడం, ఆస్తి పన్ను అసెస్‌మెంట్‌ల సరిదిద్దడం, బిల్ కలెక్టర్ల...