భారతదేశం, ఆగస్టు 9 -- Geetu Mohandas: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ కామెంట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

యశ్ 'టాక్సిక్' మూవీ ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 8) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం తాను పడిన కష్టాన్ని, కుటుంబం ఇచ్చిన సహకారాన్నిగీతూ గుర్తు చేసుకుంది.

"ముందుగా మా అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని రోజులు నా కూతురిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. అమ్మకు నేనెప్పుడూ థ్యాంక్స్ చెప్పాలనుకునేదాన్ని.. ఈ రోజు ఆ క్షణం వచ్చింది. ఇలాంటి ఒక అద్భుతమైన టీమ్‌తో పనిచే...