భారతదేశం, సెప్టెంబర్ 29 -- GATE 2027 Registration : దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) 2027 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఐఐటీ మద్రాస్ (చెన్నై) కీలక ప్రకటన చేసింది. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు మరొక అవకాశం కల్పిస్తూ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించింది.

అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ gate2027.iitm.ac.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, సమర్పించిన దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు 'అప్లికేషన్ కరెక్షన్ విండో'ను అక్టోబర్ 14న అందుబాటులోకి వస్తుంది. ఈ సవరణల ప్రక్రియ అక్టోబర్ 21, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాల (పరీక్షా నగరం)...