భారతదేశం, మార్చి 10 -- ఇటీవల దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60, వాణిజ్య సిలిండర్‌పై రూ.115 పెరిగింది. ఏపీలోని అనేక జిల్లాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లను పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హోటళ్లు అధిక ధరలకు సిలిండర్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. యుద్ధ సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకుని దేశీయ ఎల్పీజీ సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది. పశ్చిమాసియా యుద్ధ భయాలను చూపిస్తూ పలువురు సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. కొంతమంది ఎల్పీజీ పంపిణీదారులు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ అనధికారిక మార్గాల ద్వారా సిలిండర్లను అమ్మేస్తున్నారు. వారం క్రితం వరకు దాదాపు రూ.2,200కి లభించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు బ్లాక...