భారతదేశం, మే 1 -- Gaayapadda Sihmham Movie Review In Telugu And Rating: తెలుగు రాష్ట్రాల్లో 'అమెరికా వెళ్లడం' అనేది ఒక ఎమోషన్. ఆ కల చెదిరిపోతే ఒక యువకుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడిపైనే పగ తీర్చుకోవాలనుకుంటే? వినడానికే క్రేజీగా ఉన్న ఈ పాయింట్‌తో వచ్చిన సినిమానే 'గాయపడ్డ సింహం'.

టాలీవుడ్ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన సినిమానే గాయపడ్డ సింహం. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సెటైరికల్ కామెడీగా తెరకెక్కించారు. డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న అంటే ఇవాళ విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి గాయపడ్డ సింహం రివ్యూలో చూద్దాం.

టైటిల్: గాయపడ్డ సింహం

నటీనటులు: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి, కశ్యప్ శ్రీనివాస్, శ్రీవిష్ణు, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, ...