FTO in Kurnool : ఆంధ్రప్రదేశ్ వైమానిక చరిత్రలో సరికొత్త అధ్యాయం - కర్నూలులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం
భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైమానిక రంగ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. కర్నూలు విమానాశ్రయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO - పైలట్ శిక్షణా కేంద్రం) అధికారికంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ నూతన పైలట్ శిక్షణా కేంద్రాన్ని శనివారం.. ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ సెంటర్ ఏర్పాటుతో.. రాష్ట్రంలో విమానయాన రంగానికి, యువతకు లభించే ఉపాధి అవకాశాలకు సరికొత్త దిశను చూపించనుంది. సొంత రాష్ట్రంలోనే విమానాలు నడిపే పైలట్లుగా శిక్షణ పొందే అపూర్వ అవకాశం ప్రాంతీయ అభ్యర్థులకు లభించనుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.
తాజాగా ప్రారంభమైన తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌తో పాటు, రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరో 5 ఎఫ్టిఓ (FTO) లను అందుబాటులోకి తీసుకురానున్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.