భారతదేశం, సెప్టెంబర్ 25 -- Friday Top 7 OTT Release Movies Today: వారాంతం వచ్చిందంటే చాలు సినిమా ప్రియుల చూపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఉంటుంది. థియేటర్లలో కొత్త సినిమాలు చూసే అవకాశంతో పాటు ఇంట్లోనే కూర్చుని వైవిధ్యమైన కథలను ఆస్వాదించేందుకు ఓటీటీ సంస్థలు సరికొత్త చిత్రాలను రెడీ చేశాయి.

ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 25న) ఓటీటీలోకి అస్సలు మిస్ అవ్వకూడని టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు . హారర్, కామెడీ, సస్పెన్స్, రొమాంటిక్ డ్రామా విభాగాల్లో అలరించేందుకు ఈ సినిమాలు సిద్ధమయ్యాయి. నయనతార, అల్లరి నరేష్ సినిమాల నుంచి హారర్ థ్రిల్లర్ వరకు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ టాప్ 7 సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

1. అగధ ఓటీటీ: ప్రముఖ దర్శకుడు ఎమ్.ఎస్. రాజు తెరకెక్కించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'అగధ'. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5 (ZEE5) ప...