భారతదేశం, ఏప్రిల్ 7 -- సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉచితంగా జనరల్ స్టడీస్ టెస్ట్‌ను పెట్టనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏప్రిల్ 12న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జనరల్ స్టడీస్‌పై ఉచిత పరీక్షను నిర్వహిస్తోంది.

టెస్ట్ సిరీస్ బ్రోచర్‌ను వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. కుమార్ లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్-ఛాన్సలర్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు విద్యాపరమైన ప్రతిభతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలలో కూడా రాణించడానికి కృషి చేయాలని సూచించారు.

ఇలాంటి పరీక్షలు విద్యార్థులు తమ సన్నద్ధతను, పనితీరును మెరుగుపరుచుకోవడానికి గణనీయంగా సహాయపడతాయని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. అభ్యర్థులు తాము పో...