Fly91 Tirupati Flights : తిరుపతి - విజయవాడ ప్రయాణికులకు శుభవార్త - కొత్త విమాన సర్వీసులు ప్రారంభం, షెడ్యూల్ ఇలా
భారతదేశం, సెప్టెంబర్ 10 -- ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి విమాన అనుసంధానం మరింత పెరిగింది. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై91 (Fly91) తిరుపతి కేంద్రంగా విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి నగరాలకు కొత్త విమాన సర్వీసులను గురువారం ప్రారంభించింది. తిరుపతి నుంచి బయలుదేరిన తొలి విమానం. విజయవాడ విమానాశ్రయంలో దిగగానే వాటర్ క్యానన్ సెల్యూట్‌తో ఘనంగా స్వాగతం పలికారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ నూతన సర్వీసును జెండా ఊపి(వర్చువల్) ప్రారంభించారు.
ఈ కొత్త సర్వీసుల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఫ్లై91కి మూడో గమ్యస్థానంగా మారింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా కలిపి ఈ సంస్థ సర్వీసులు అందిస్తున్న నగరాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఫ్లై91 విమానయాన నెట్‌వర్క్‌లో మొత్తం గమ్యస్థానాల సంఖ్య 13కు చేరుకుంది.
ఈ సందర్భంగా కే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.