భారతదేశం, జూలై 8 -- విజయవాడ (గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తీపి కబురు అందించింది. ఆధ్యాత్మిక రాజధాని వారణాసి (కాశీ), చారిత్రక నగరం కోల్‌కతాతో విజయవాడను అనుసంధానిస్తూ సరికొత్త విమాన సర్వీసులను ఆగస్టు 13 నుంచి ప్రారంభించనుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఇండిగో ప్రతినిధులు ఈ సర్వీసులను రూట్ మ్యాప్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

"ఈ కొత్త విమాన సర్వీసులు ప్రయాణికులకు ఎంతో సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక, వ్యాపార రంగాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి," అని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయవాడ న...