Fire Accident : అపార్ట్మెంట్లో ఎగసిపడిన మంటలు.. భయంతో పరుగులు తీసిన జనాలు
భారతదేశం, నవంబర్ 19 -- హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని నానక్‌రామ్‌గూడ (పుప్పాలగూడ ప్రాంతం)లో ఉన్న ప్రముఖ నివాస సముదాయం పసిఫికా హిల్‌క్రెస్ట్ హైరైజ్ అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ 22 అంతస్తుల భవనంలోని ఒక బ్లాక్‌లో ఐదో అంతస్తు నుండి మంటలు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే మంటలు, దట్టమైన పొగ భవనంలోని పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. దీంతో అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భవనం నుండి బయటకు పరుగులు తీశారు.
ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ప్రతి ఫేజ్‌లో సుమారు ఐదు బ్లాక్‌లు ఉన్నాయి. ఒక్కో బ్లాక్ మధ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.