భారతదేశం, జూన్ 11 -- Fifa World Cup 2026 OTT Streaming Live Details: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఫిఫా ప్రపంచకప్ 2026 ఫుట్‌బాల్ జాతర నేటి (జూన్ 11) నుంచే ఘనంగా ప్రారంభం కానుంది. భారత్‌లోని ఫుట్‌బాల్ ప్రేమికులకు ఈ మెగా టోర్నీని మరింత దగ్గర చేసేందుకు ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) సర్వం సిద్ధం చేసింది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను అత్యుత్తమ క్వాలిటీతో కూడిన లైవ్ ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా వీక్షకులకు అందించేందుకు జీ5 పక్కా ప్రణాళికలు రచించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఫుట్‌బాల్‌కు భారీగా ఆదరణ పెరుగుతోంది. అర్ధరాత్రి మ్యాచ్‌లు ఉన్నా సరే మొబైల్ స్క్రీన్‌లకు అతుక్కుపోయే అభిమానుల కోసం ఈసారి సరికొత్త డిజిటల్ అనుభూతిని మేకర్స్ సిద్ధం చేశారు.

ఈసారి వరల్డ్ కప్‌ టోర్నీని...