FIFA World Cup 2026 : సౌతాఫ్రికాపై మెక్సికో విక్టరీ- మూడు రెడ్ కార్డ్‌లతో హై టెన్షన్!
భారతదేశం, జూన్ 12 -- ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మహా సమరం మైదానంలో హై వోల్టేజ్ డ్రామాతో షురూ అయింది. గురువారం రాత్రి జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కో-హోస్ట్ దేశమైన మెక్సికో సంచలన విజయాన్ని నమోదు చేసింది. జూలియన్ క్వినోన్స్, రౌల్ జిమెనెజ్ చెరో గోల్‌తో చెలరేగడంతో గ్రూప్-ఏలో జరిగిన ఈ పోరులో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
సుమారు 80,824 మంది ప్రేక్షకుల కేరింతల మధ్య చారిత్రాత్మక అజ్టెకా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో 48 జట్లతో జరుగుతున్న ఈ ఫిఫా వరల్డ్ కప్ 2026కి ఇదొక అదిరిపోయే స్టార్ట్ అని చెప్పాలి. రెండు హాఫ్‌లలోనూ మెక్సికో ఒక్కో గోల్ కొట్టి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, మైదానంలో ఆటగాళ్ల దూకుడు కారణంగా మూడు రెడ్ కార్డ్‌ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.