భారతదేశం, జూన్ 12 -- ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్ 2026 మహా సమరం మైదానంలో హై వోల్టేజ్ డ్రామాతో షురూ అయింది. గురువారం రాత్రి జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కో-హోస్ట్ దేశమైన మెక్సికో సంచలన విజయాన్ని నమోదు చేసింది. జూలియన్ క్వినోన్స్, రౌల్ జిమెనెజ్ చెరో గోల్‌తో చెలరేగడంతో గ్రూప్-ఏలో జరిగిన ఈ పోరులో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.

సుమారు 80,824 మంది ప్రేక్షకుల కేరింతల మధ్య చారిత్రాత్మక అజ్టెకా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో 48 జట్లతో జరుగుతున్న ఈ ఫిఫా వరల్డ్​ కప్​ 2026కి ఇదొక అదిరిపోయే స్టార్ట్ అని చెప్పాలి. రెండు హాఫ్‌లలోనూ మెక్సికో ఒక్కో గోల్ కొట్టి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించగా, మైదానంలో ఆటగాళ్ల దూకుడు కారణంగా మూడు రెడ్ కార్డ్‌ల...