భారతదేశం, జూలై 4 -- Fauzi Release Date: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఫౌజీ'. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టావంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఫౌజీ చిత్రం డిసెంబర్ 3, 2026న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ తేదీపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఫౌజీ మూవీ మాత్రం 2026లోనే రిలీజ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి.

ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ కోసం మేకర్స్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ డీల్ ను పాపులర్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు టాక్. ఆ నెట్ ఫ్లిక్స్ ...