భారతదేశం, మార్చి 11 -- దేశంలోని దక్షిణాది రాష్ట్రాలన్నింటికంటే తెలంగాణలో రైతుల రుణ భారం అత్యల్పంగా ఉంది. వ్యవసాయం ఎక్కువగా ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైతుల రుణ భారం చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

అధికారిక గణాంకాల ప్రకారం, డిసెంబర్ 31, 2025 నాటికి తెలంగాణలో రైతుల మొత్తం అప్పు రూ.1,75,960.56 కోట్లు, అందులో పంట రుణాలు రూ.95,167.98 కోట్లు, టర్మ్ రుణాలు రూ.80,792.58 కోట్లు.

కర్ణాటకలో రైతుల మొత్తం అప్పులు రూ.2,10,244.47 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైతుల అప్పుల భారం రూ.3,75,254.59 కోట్లుగా ఉంది. ఇక తమిళనాడులో రైతుల మొత్తం అప్పుల భారం రూ.5,06,290.45 కోట్లు, ఇది దక్షిణ భారతదేశంలో అత్యధికం. కేరళ అత్యల్పంగా రూ.1.61 లక్షల కోట్లతో ఉంది.

త...