భారతదేశం, ఏప్రిల్ 3 -- తెలంగాణలో మరికొన్ని రోజుల్లో వేసవి సెలవులు మెుదలుకానున్నాయి. అంతకుముందు విద్యార్థులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలపై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరగాల్సిన సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-2) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి.

ఎస్‌ఏ-2 పరీక్షలు ఈనెల 10 నుంచి 20వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పరీక్షలు ఉన్నాయి. ఈ కారణంగా ఎస్‌ఏ 2 పరీక్షలు అన్ని కూడా రెండు రోజుల ముందు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు.

అంటే నిజానికి ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభంకావాల్సిన ఈ పరీక్షలు.. ఈనెల 8న ప్రారంభవుతాయి. ఏప్రిల్‍ 18వ తేదీతో ముగుస్తాయి. ఒకటో తరగతి నుంచి 7వ తరగతికి సంబంధించిన పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30వరకు జరుగుతాయి. అదే ఎనిమిదో తరగ...