భారతదేశం, ఏప్రిల్ 28 -- భారతీయ స్టార్టప్ ప్రపంచంలో జొమాటో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సంస్థ మాతృ సంస్థ అయిన 'ఎటర్నల్' (Eternal) తన నాలుగో త్రైమాసిక ఫలితాలతో దలాల్ స్ట్రీట్‌ను ఆశ్చర్యపరిచింది. 2026 మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి (Q4FY26) సంబంధించిన లెక్కలను కంపెనీ మంగళవారం మార్కెట్ వేళల్లో విడుదల చేసింది. గత ఏడాది ఇదే సమయంలో రూ. 39 కోట్లుగా ఉన్న నికర లాభం, ఇప్పుడు ఏకంగా రూ. 174 కోట్లకు చేరుకోవడం గమనార్హం. అంటే ఏడాది ప్రాతిపదికన 346 శాతం వృద్ధి నమోదైంది.
కేవలం లాభం మాత్రమే కాదు, కంపెనీ ఆదాయం (Revenue from operations) కూడా కళ్లు చెదిరే రీతిలో పెరిగింది. గత ఏడాది క్యూ4లో రూ. 5,833 కోట్లుగా ఉన్న రెవెన్యూ, ఈసారి 196.5 శాతం పెరిగి రూ. 17,292 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (FY26) లెక్కలను పరిశీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.