భారతదేశం, మార్చి 3 -- ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడులతో అంతర్జాతీయ విమాన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

ఈ భయానక పరిస్థితుల నడుమ అబుదాబిలో చిక్కుకుపోయిన బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా ఎట్టకేలకు మార్చి 2న ఢిల్లీ చేరుకున్నారు. సురక్షితంగా ఇంటికి చేరిన తర్వాత, గడిచిన ఆ మూడు రోజుల్లో తను అనుభవించిన నరకాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

"ఫిబ్రవరి 28వ తేదీన నేను విమానాశ్రయానికి చేరుకున్నాను. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఎయిర్‌పోర్టును మూసివేశారు. చుట్టూ అంతా గందరగోళం.. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు" అని ఈషా గుప్తా తెలిపారు.

"కాసేపటికే క్షిపణి దాడుల వార్తలు రావడం మొదలైంది. తర్వాతి నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని స్థితి. గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఒకరినొకరు ఓ...