భారతదేశం, సెప్టెంబర్ 11 -- Epic First Semester Review And Rating In Telugu: ప్రతి ఏటా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు విదేశీ విద్య కోసం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా విమానాలు ఎక్కుతుంటారు. తల్లులు, తండ్రులు తమ ఆస్తులు అమ్మి, అప్పులు చేసి మరీ పిల్లలను లండన్ పంపుతారు.

అక్కడికి వెళ్లాక ఎదురయ్యే ఒంటరితనం, గది సర్దుకోవడం నుంచి వంట వండుకోవడం వరకు పడే యాతన, కొత్త సంస్కృతిలో నెట్టుకొచ్చే క్రమంలో మొదలయ్యే అనుబంధాల గురించి ఏ యూనివర్సిటీ బ్రోచర్ చెప్పదు. సరిగ్గా ఈ పాయింట్‌ను ఆధారం చేసుకుని 'బేబి' కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన చిత్రమే 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్'.

ఈ ఎపిక్ మూవీ ఇవాళ శుక్రవారం (సెప్టెంబర్ 11) థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, బేబీ కాంబినేష...