భారతదేశం, నవంబర్ 27 -- Ee Nagaraniki Emaindi Repeat 8 Days Worldwide Collection: 2016లో తెలుగు సినిమా రొటీన్ మాస్ మసాలా కథలు, కుటుంబ డ్రామాల మధ్య నలుగుతున్న వేళ 'పెళ్లి చూపులు' ఒక కొత్త గాలిలా వచ్చింది. ఫుడ్ ట్రక్ నడిపే ఇద్దరు యువతీయువకుల కథతో తరుణ్ భాస్కర్ టాలీవుడ్‌కు సరికొత్త మేకింగ్ శైలిని పరిచయం చేశారు.

ఆ చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ వైపు అడుగులు వేస్తే, తరుణ్ భాస్కర్ కొత్త తరం దర్శకుడిగా తన ముద్ర వేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత 2018లో 'ఈ నగరానికి ఏమైంది' (ENE) సినిమాతో నలుగురు చిన్ననాటి స్నేహితుల షార్ట్ ఫిల్మ్ ప్రయాణాన్ని చూపించి యువతకు ఆల్-టైమ్ ఫేవరెట్‌గా మారారు.

విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమానులను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశారు. అయితే కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ, తరుణ్ భాస్కర్ స...