భారతదేశం, ఏప్రిల్ 21 -- సొంత ఇల్లు, కొత్త కారు లేదా పిల్లల ఉన్నత చదువులు.. ఇలా మన జీవితకాల లక్ష్యాలను చేరుకోవడానికి లోన్ తీసుకోవడం ఇప్పుడు అనివార్యంగా మారింది. అయితే, మనం తీసుకునే ఈ అప్పులే మన ఆర్థిక స్వేచ్ఛను నిశ్శబ్దంగా హరిస్తున్నాయా? నెలవారీ ఆదాయంలో ఎక్కువ భాగం కేవలం ఈఎంఐలకే (EMIs) సరిపోతోందా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. రుణం భారం కాకూడదన్నా, ఒత్తిడి లేని జీవితం గడపాలన్నా మన సంపాదనకు, అప్పులకు మధ్య సరైన సమతుల్యత ఉండటం చాలా ముఖ్యం.

లోన్ల విషయంలో ఆర్థిక నిపుణులు ఒక ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా నమ్ముతారు. అదే 30 శాతం నిబంధన. "మీ నెలవారీ నికర ఆదాయంలో లోన్ రీపేమెంట్ ఈఎంఐ 25 నుంచి 30 శాతం లోపే ఉండటం క్షేమకరం. ఈ పరిమితి దాటితే మీ ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా డబ్బుల్లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది" అని హ...