భారతదేశం, మార్చి 12 -- రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారారు కానీ... ఫారెస్ట్ మారలేకపోతోందంటూ సీఎం కామెంట్ చేశారు. అటవీ శాఖ అధికారుల తీరు వల్ల ఇటీవల కాలంలో ఏర్పడ్డ ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులపై జిల్లాల కలెక్టర్లకు వివిధ సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 'హిందూపూర్ వద్ద ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు ఆలోచిస్తున్నాం. అభివృద్ధికి, మౌలిక సదుపాయల కల్పనకు అటవీ శాఖ సహకరించాలి. నాలుగోసారి సీఎంగా చేస్తున్నాను.. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మాట్లాడాను. మళ్లీ మరోసారి మా...