భారతదేశం, మే 10 -- ఇంట్లోని విద్యుత్ మీటర్ ఒక సాధారణ పెట్టేగా చూడకూడదు. వాస్తును కూడా ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పట్టించుకోని ఈ ఒక్క ప్రదేశం.. ఇంటి శాంతిని, పురోగతిని మార్చగలదా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది.

ఇంటి నిర్మాణంలో వాస్తు ఒక ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు. ఇంటి ద్వారం నుండి వంటగది వరకు ప్రతి ప్రదేశం ఏ దిశలో ఉండాలనే దానిపై అనేక నమ్మకాలు ఉన్నాయి. అదే విధంగా ప్రతిరోజూ ఉపయోగించే విద్యుత్ మీటర్‌ను ఉంచే స్థానం కూడా వాస్తు కోణంపై ప్రభావం చూపుతుందని కొందరు నమ్ముతుంటారు. ఇది కేవలం సౌకర్యం కోసం ఉంచే పరికరం మాత్రమే కాదు. దీనిని ఇంటిలోని శక్తి ప్రవాహానికి సంబంధించినదిగా చూస్తారు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో వస్తువులను ఒక దిశలో అమర్చడం అనేది కుటుంబ పురోగతి, ఆరోగ్యం, ఆర్థిక స్థితి మొదలైన వాటిని ప్రభావిత...