భారతదేశం, మార్చి 2 -- భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్.. తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమైంది. ఇటీవలే భారీ బ్యాటరీ ప్యాక్, ఆకర్షణీయమైన ధరతో 'పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్'ను విడుదల చేసిన ఈ స్వదేశీ దిగ్గజం, ఈ ఏడాది మరో రెండు సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను తీసుకురానుంది. అవే ఐకానిక్ 'సియెర్రా ఈవీ', పాపులర్ 'టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్'.

2025 చివరిలో సియెర్రా ఐసీఈ వర్షెన్​ని లాంచ్​ చేసిన టాటా మోటార్స్​ సంస్థ.. ఇప్పుడు దాని ఎలక్ట్రిక్​ మోడల్​పై పనిచేస్తోంది. ఈ కొత్త సియెర్రా ఈవీ 2026 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్ మధ్య) విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది టాటా అడ్వాన్స్‌డ్ 'Acti.ev' ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది.

బ్యాటరీ ప్యాక్: ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉండనున్నాయి. కర్వ్ ఈవీ నుంచి 55 కేడబ్ల్యూహెచ్​...