భారతదేశం, మే 4 -- అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల ఫలితాల కోసం యావత్​ భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. తొలుత బ్యాలెట్​ లెక్కింపు ఉంటుంది. 30 నిమిషాల అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు.

అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చెరిలలో ఇంకొద్ది సేపట్లో, కట్టుదిట్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలుత పోస్టల్​ బ్యాలెట్​ పేపర్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది.

సాధారణంగా కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంటుంది. కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని చెరిపివేసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ఆయన గెలిస్తే అది ఒక రికార్డు అవుతుంది. ఒకవేళ ఇక్కడ లెఫ్ట్ కూటమి ఓడిపోతే, 1977 తర...