భారతదేశం, మే 3 -- Sai Pallavi Ek Din Box Office Collection Day 2: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా పరిచయమైన చిత్రం 'ఏక్ దిన్'. శుక్రవారం (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిశ్రమ స్పందన లభించింది. విమర్శకుల నుంచి ప్రతికూల రివ్యూలు రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

సాధారణంగా శనివారం నాడు వసూళ్లలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూట్ ఇచ్చిన ఏక్ దిన్ సినిమా విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రెండో రోజు కూడా కలెక్షన్లు ఫ్లాట్‌గా ఉండటం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం, రెండో రోజు ఏక్ దిన్ చిత్రం కేవలం ఒక కోటి రూపాయల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించింది. మొదటి రోజు సాధ...